నాకు క్రికెట్ ఆడటమే తెలుసు.. బెదిరించడం తెలియదు

0
186

టీమిండియా మాజీ పేస్ బౌలర్, 2011 ప్రపంచ కప్ జట్టు సభ్యుడు మునాఫ్‌ పటేల్ విదర్భ క్రికెట్‌ చీఫ్‌ దేవేంద్ర సుర్తి పై ఫైర్ అయ్యారు. తనను కావాలనే సంబంధం లేని విషయాల్లో ఇరికిస్తున్నారని మునాఫ్‌ ఆరోపించాడు. బరోడా క్రికెట్‌ అసోసియేషన్‌ (బీసీఏ) క్రికెట్‌ జట్టుకు మునాఫ్‌ పటేల్‌ మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. విషయమేమిటంటే.. మునాఫ్‌ చంపుతానంటూ బెదిరించినట్లు దేవేంద్ర సుర్తి నవపుర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బరోడా క్రికెట్ అసోసియేషన్‌కు వ్యతిరేకంగా సిహెచ్‌ఎస్ తీసుకుంటున్న అవినీతి నిరోధక చర్యల కారణంగా.. మునాఫ్‌ తనను లక్ష్యంగా పెట్టుకున్నాడని, ఆ అవినీతి సహించలేక మునాఫ్‌ బెదిరింపులకు దిగాడని సుర్తి ఫిర్యాదులో పేర్కొన్నాడు.

Image result for munaf patel

అయితే.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న నవపుర పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ విషయంపై తాజాగా మునాఫ్‌ స్పందించాడు. ‘అనవసరంగా నన్ను ఈ విషయంలోకి లాగుతున్నారు. ఎటువంటి కారణాలు లేకుండా నా పేరును తెరపైకి తెచ్చారు. నాకు తెలిసినంత వరకూ క్రికెట్‌ ఆడటమే తెలుసు. నా జీవితమంతా అలానే కొనసాగిస్తా. దేవేంద్ర సుర్తికి సెలక్షన్‌ కమిటీ సభ్యులతో ఇబ్బందులున్నాయి. నేను కేవలం బీసీఏ క్రికెట్‌ జట్టుకు మెంటార్‌ని మాత్రమే. నాకు సెలక్షన్స్‌తో ఎటువంటి సంబంధం ఉండదు’ అని మునాఫ్ తెలిపాడు. ఎటువంటి కారణం లేకుండా నా పేరు ఈ విషయంలోకి లాగారు. ఇది అనవసరమైన రాద్ధాంతం. ఆ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి. నేను ఎవర్నీ చంపుతానని బెదిరించలేదు’ అని మునాఫ్‌ పేర్కొన్నాడు.

Image result for munaf patel

ఇదిలావుంటే.. మునాఫ్‌ పటేల్‌ 2006లో భారత్‌ తరఫున అరంగేట్రం చేసి 70 వన్డేలు, 13 టెస్టులు, 3 టీ20లు ఆడాడు. 201లో భారత్‌ ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడు. మునాఫ్ గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పాడు.