అప్పటి వరకూ షమీపై చర్యల్లేవన్న బీసీసీఐ!

0
150

మహ్మద్ షమీపై కోల్‌కతాలోని అలిపోర్ కోర్టు గత సోమవారం అరెస్ట్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో.. ప్రస్తుతం అమెరికాలో ఉన్న షమీ.. బెయిల్ కోసం తన లాయర్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మహ్మద్ షమీ తనని వేధిస్తున్నాడంటూ గత ఏడాది మార్చిలో అతని భార్య హసీన్ జహాన్ కోల్‌కతాలో పోలీసు కేసు పెట్టింది. దీంతో.. గత ఏడాది కొద్దిరోజుల పాటు బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్‌ని కూడా కోల్పోయిన షమీ.. విచారణ నిమిత్తం న్యాయస్థానం ఎదుట హాజరు కాలేదు.

Image result for mohammad shami

దీంతో.. ఆగ్రహించిన కోర్టు.. అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ 15 రోజుల లోపు లొంగిపోవాలని ఆదేశించింది. వారెంట్ నేపథ్యంలో.. ముందస్తు బెయిల్‌ కోసం షమీ ప్రయత్నాలు ముమ్మరం చేశాడు.అయితే.. మహ్మద్ షమీ అమెరికాలో ఉండిపోవడంపై బీసీసీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ ‘వెస్టిండీస్ పర్యటన ముగించుకున్న షమీ.. ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. ఈనెల 12న భారత్‌కి అతను రానుండగా.. రెగ్యులర్‌గా లాయర్‌తో టచ్‌లో ఉన్నట్లు బోర్డులోని సంబంధిత అధికారులకి సమాచారం అందించాడు. ఛార్జ్‌‌షీట్ చూసేవరకూ షమీపై బీసీసీఐ ఎలాంటి చర్యలు తీసుకోదు’ అని వెల్లడించాడు.