యుఎస్ ఓపెన్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లిన ఉక్కుమహిళ

0
103

అమెరికన్ స్టార్ టెన్నిస్‌ ప్లేయర్ సెరెనా విలియమ్స్‌ యుఎస్ ఓపెన్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీస్‌లో ఐదో సీడ్‌ స్వితోలినాపై సెరెనా 6-3, 6-1 తేడాతో విజయం సాధించింది. ప్రత్యర్థిని వరుస సెట్లలో మట్టికరిపించి టైటిల్ పోరుకు సిద్ధమైంది. కాగా, సెరెనా తలపడిన ఆఖరి ఆరు టోర్నమెంట్స్‌లో నాలుగో సారి ఫైనల్‌కు చేరడం విశేషం. ఇటీవల జరిగిన వింబుల్డన్‌లో ఫైనల్‌కు చేరిన సెరెనా 2-6, 2-6 తేడాతో టైటిల్‌ను చేజార్చుకుంది. మరో సెమీస్‌లో బెన్సిచ్‌, ఆండ్రిస్కూ తలపడుతున్నారు. ఈ మ్యాచ్‌లోని విజేతతో సెరెనా ఫైనల్లో తలపడనుంది.