యాషెస్ నాలుగో టెస్టులో ‘స్మిత్’ సూపర్ మ్యాన్ షో

0
100

బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడి నిషేధానికి గురైన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవెన్ స్మిత్.. ఆ తర్వాత ఎన్నో అవమానాలు ఎదురుకున్నాడు. జాతీయ జట్టు నుంచి చోటు కోల్పోయిన అతను.. ఈ ఏడాది మార్చితో అతనిపై నిషేధం ముగియడంతో ప్రపంచకప్ జట్టులో అతను చోటు దక్కించుకున్నాడు. అయితే ప్రపంచకప్‌లో స్మిత్ అంతగా రాణించలేదు. కానీ, ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో అతను తన బ్యాట్‌కి పని పెట్టాడు. ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో డబుల్ సెంచరీ సాధించి.. టెస్ట్‌ల్లో తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నాడు.

Image result for steve smith

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడింది. ఈ దశలో స్మిత్ ఇంగ్లండ్ బౌలర్లను ధీటుగా ఎదురుకుంటూ పరుగుల వరద పారించాడు. తోటి బ్యాట్స్‌మెన్లు పెవిలియన్ చేరుతున్నా.. తాను మాత్రం పట్టువదలకుండా బ్యాటింగ్ చేస్తున్నాడు. 314 బంతుల్లో 23 ఫోర్లు, 2 సిక్సులతో 205 పరుగులు చేసి టెస్టుల్లో మూడవ డబుల్ సెంచరీ సాధించాడు. స్మిత్ వీరోచిత ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియా 117 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 416 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లు స్మిత్ వికెట్ పడగొట్టటానికి నానా తంటాలు పడ్డారు. అయితే జో రూట్ వేసిన 118వ ఓవర్ ఐదో బంతికి రివర్స్ స్వీప్ షాట్ కొట్టాలని ప్రయత్నించి స్మిత్ పెవిలియన్ చేరాడు. అయితే.. గత మ్యాచ్ లలో చేదు అనుభవం ఎదుర్కొన్న స్మిత్ కు.. అవుటయ్యి పెవిలియన్ చేరుతుండగా ప్రేక్షకుల నుంచి స్టాడింగ్ ఒవేషన్ రావడం విశేషం.