ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్‌బై’

ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్‌బై’ చెబుతున్నానని మాజీ మంత్రి జీటీ దేవేగౌడ ప్రకటించారు. జేడీఎస్‌ పార్టీ సీనియర్‌ నేతగానే కాకుండా మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యను గత ఏ

0
77

ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్‌బై’ చెబుతున్నానని మాజీ మంత్రి జీటీ దేవేగౌడ ప్రకటించారు. జేడీఎస్‌ పార్టీ సీనియర్‌ నేతగానే కాకుండా మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యను గత ఏడాది చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి ఓడించి రికార్డు తిరగరాసిన జీటీ దేవేగౌడ రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. మైసూరులో గురువారం జీటీ దేవేగౌడ మీడియాతో మాట్లాడారు. రాజకీయ జీవితంలో ఎంతోస్థాయికి ఎదిగానని ఇటీవల పరిణామాలతో విసుగు చెందానన్నారు. రాజకీయాలకు దూరంగా ఉండాలనే నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితిలోను మార్చుకునేది లేదన్నారు. చాముండేశ్వరీ నియోజకవర్గ బాధ్యతలను నా కుమారుడు కొంత కాలం పర్యవేక్షిస్తారని కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేయరన్నారు.

విశ్వనాథ్‌పై అనర్హత వేటు పడటంతో ఖాళీ అయిన హుణసూరు నియోజక వర్గం నుంచి నా కుమారుడికి బరిలో నిలిపేలా కుమారస్వామి సూచించారని అందుకు తాము సిద్దంగా లేమని స్పష్టం చేశామన్నారని అన్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో అనుక్షణం అవమానాలు ఎదుర్కొన్నానని ఉన్నత విద్యాశాఖా మంత్రి హోదా వద్దని వేడుకున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నా బాధను అర్థం చేసుకునేందుకు ఒక్కరూ ప్రయత్నించలేదన్నారు