నెట్టింట రచ్చ చేస్తున్న ‘తిప్పరా మీసం’ టీజర్

0
69

అప్పట్లో ఒకడుండేవాడు, నీది నాది ఒకే కథ, బ్రోచేవారెవరురా వంటి హిట్ చిత్రాల తర్వాత శ్రీవిష్ణు నటిస్తోన్న తాజా చిత్రం ‘తిప్పరా మీసం’. వినూత్న కథాంశంతో ప్రేక్షకుల ముందుకొస్తున్న శ్రీవిష్ణు.. ఇపుడు టీజర్ తో పలకరించాడు. మందు, సిగరెట్‌, అమ్మాయిల్లా.. శత్రువు కూడా వ్యసనమే..ఆ వ్యసనానికి నేను కూడా బానిసనే అని శ్రీవిష్ణు చెప్పే డైలాగ్ తో టీజర్ ఆసక్తికరంగా ఉంది. గుబురు గడ్డంతో సీరియస్ లుక్ లో కనిపిస్తున్న తిప్పరా మీసం టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాకు కృష్ణ విజయ్‌ దర్శకత్వం వహిస్తుండగా.. రిజ్వాన్‌ నిర్మిస్తున్నారు.