దిగ్గజాల పోరుకు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయిన టిక్కెట్లు

0
102

టెన్నిస్‌ దిగ్గజాలు రోజర్‌ ఫెదరర్‌, రఫెల్‌ నాదల్‌ మధ్య పోరు అంటే అభిమానులకు పండుగే. ఈ పోటీని చూసేందుకు అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తారు. వివరాల్లోకెళితే.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌ వేదికగా ఈ ఇరువురు స్టార్లు రోజర్‌ ఫెదరర్‌ ఫౌండేషన్‌కు నిధుల సేకరణ కోసం ఓ మ్యాచ్‌ ఆడనున్నారు.

Related image

అయితే.. ఈ మ్యాచ్‌కు సంబంధించిన 48 వేల టికెట్లను అమ్మకానికి పెట్టగా హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. కేవలం 10నిమిషాల్లోనే మొత్తం అయిపోయాయి. ఒక్కో టికెట్‌ ధర 10 నుంచి 130 డాలర్లుగా నిర్వాహకులు నిర్ణయించారు. ఒక్కసారిగా మ్యాచ్‌ టికెట్స్ బుకింగ్ కు అనూహ్య స్పందన వచ్చింది. మద్దతు తెలిపిన అందరికీ కృతజ్ఞతలు. 10 నిమిషాల్లోనే టికెట్లన్నీ అమ్ముడైపోయాయి. ఇప్పుడు టికెట్లు దక్కని వారి కోసం వీలైతే అదనపు స్టాండ్లు ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలిస్తాం’ అని మ్యాచ్‌ నిర్వాహకుడు, ఫెదరర్‌ ఫౌండేషన్‌ సీఈవో జానీనే హాండెల్‌ ప్రకటించారు.