జాబిల్లిపై కాలు మోపనున్నచంద్రయాన్ 2…ఇదే అత్యంత కీలక దశ: ఇస్రో చైర్మన్

మరికొన్ని గంటల్లో జాబిల్లిపై చంద్రయాన్-2 అడుగు పెట్టబోతోంది. చంద్రయాన్-2 శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30 గంటల నుంచి 2.30ధ్య గంటల మధ్య చంద్రుడిపై కాలుమోపనుంది

0
140

మరికొన్ని గంటల్లో జాబిల్లిపై చంద్రయాన్-2 అడుగు పెట్టబోతోంది. చంద్రయాన్-2 శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30 గంటల నుంచి 2.30ధ్య గంటల మధ్య చంద్రుడిపై కాలుమోపనుంది. అనంతరం దాని నుంచి ప్రజ్ఞాన్ రోవర్ విడిపోయి చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు సాగిస్తుంది.

ఈ కీలక తరుణంలో ఇస్రో చైర్మన్ శివన్ మీడియాతో మాట్లాడారు. చంద్రయాన్-2 ప్రాజెక్టులో భాగంగా ఇప్పటివరకు జరిగిన ప్రయాణం ఒక ఎత్తయితే, విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై కాలుమోపే చివరి 15 నిమిషాలు అత్యంత కీలకం అని అన్నారు. ఇప్పటివరకు ప్రణాళిక ప్రకారం అన్ని దశలు విజయవంతం అయ్యాయని అన్నారు. చారిత్రక ఘట్టం కోసం తాము కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని చెప్పారు. చివరి 15 నిమిషాల్లో ఎన్నో సంక్లిష్టమైన ప్రక్రియలు నిర్వహించాల్సి ఉందని, ప్రతి క్షణం విలువైనదేనని తెలిపారు. భారత అంతరిక్ష రంగ చరిత్రలో ఇది అత్యంత చిరస్మరణీయమైన రోజు అవుతుందని ఉద్ఘాటించారు.