జగన్ 100 రోజుల పాలనపై జేసీ స్పందన ఇదే..

0
95

ఏపీ సీఎంగా వైఎస్ జగన్ వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వైసీపీ నేతలు జగన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తుంటే.. టీడీపీ నేతలు మాత్రం తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా.. జగన్ పాలనపై టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌ను చేయిపట్టి నడిపించేవాడు కావాలని జేసీ అన్నారు. ప్రతి అంశాన్ని మైక్రోస్కోపులో చూసి లోపాలను సరిదిద్దాలి.. అంతేగాని దాన్ని నేలకేసి కొట్టొద్దని హితవు పలికారు. కొత్తగా ఉద్యోగాల కల్పనపై దృష్టిపెట్టాలని.. ఆర్టీసీని తెచ్చి నెత్తిమీద పెట్టుకోవడం అదనపు భారమేనని జేసీ సూచించారు. అంతేకాకుండా.. ‘మా వాడు చాలా తెలివైనవాడు..’ అంటూ వైఎస్ జగన్‌కు జేసీ కితాబిచ్చారు. రాజధాని అమరావతిలోనే ఇక్కడే ఉంటుందని.. ఎక్కడికీ తరలిపోదని జేసీ అన్నారు.