చంద్రయాన్-2 చివరి దశలో సమస్య…ఇస్రో శాస్త్రవేత్తల్లో టెన్షన్..టెన్షన్..అసలు ఏమైందంటే

అతి తక్కువ ఖర్చుతో, అందునా తొలి ప్రయోగాలతోనే.. విజయం సాధిస్తున్న ఇస్రో... అంతరిక్ష రంగంలో అగ్రరాజ్యాలను కూడా నివ్వెరపోయేలా చేస్తోంది. అయితే తాజాగా ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ -2 చివరి అద్భుత ఘట్టానికి చేరుకుం

0
962

అతి తక్కువ ఖర్చుతో, అందునా తొలి ప్రయోగాలతోనే.. విజయం సాధిస్తున్న ఇస్రో… అంతరిక్ష రంగంలో అగ్రరాజ్యాలను కూడా నివ్వెరపోయేలా చేస్తోంది. అయితే తాజాగా ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ -2 చివరి అద్భుత ఘట్టానికి చేరుకుంది. అయితే 48 రోజు తర్వాత జాబిల్లి పై విక్రమ్ రోవర్ ల్యాండింగ్ అయ్యే సమయంలో సిగ్నల్స్ కు అంతరాయం ఏర్పడింది. అర్ధరాత్రి 1.40 గంటల సమయంలో చంద్రయాన్ -2 చంద్రునికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉండగా, విక్రమ్ ల్యాండర్ సిగ్నల్ కోల్పోయింది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో టెన్షన్ మొదలైంది. ఇక బెంగళూర్ సెంటర్ నుంచి స్వయంగా తిలకించేందుకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ తిరుగు పయణమయ్యారు. అయితే ఈ ఘట్టానికి సంబంధించిన ఇస్రో చైర్మన్ తాజా పరిస్థితులపై వివరించారు. సాంకేతిక కారణాలతో చంద్రునిపై చంద్రయాన్ -2 విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్ అయ్యే సమయంలో సిగ్నల్స్ సమస్య తలెత్తిందని, తాజా పరిస్థితులను ప్రధాని మోడీకి వివరించినట్లు చెప్పారు.