చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ఫైర్…

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి మండిపడ్డారు. గతంలో ఎన్నికల సందర్భంగా ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ఒ

0
76

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి మండిపడ్డారు. గతంలో ఎన్నికల సందర్భంగా ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదని విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రైవేటు ఆపరేటర్ల ప్రయోజనాల కోసం ఆర్టీసీని కొల్లగొట్టారని అన్నారు. ఆర్టీసీకి చెందిన విలువైన భూములను తనవాళ్లకు మల్టీప్లెక్సుల నిర్మాణం కోసం లీజుకు ఇప్పించారని, చంద్రబాబు ఆర్టీసీని మరుగునపడే స్థితికి తీసుకువచ్చి మూసివేత దశకు తీసుకెళ్లారని దుయ్యబట్టారు. కానీ ఏపీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారనీ, ఆర్టీసీకి తిరిగి ఊపిరి పోశారని ప్రశంసించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు