వార్నర్ ను పీడిస్తున్న ‘బ్రాడ్ ‘ గండం

బాల్‌ టాంపరింగ్‌ వివాదంతో డేవిడ్ వార్నర్‌ ఏడాది పాటు క్రికెట్‌కు దూరమైన విషయం తెలిసిందే.

0
118

బాల్‌ టాంపరింగ్‌ వివాదంతో డేవిడ్ వార్నర్‌ ఏడాది పాటు క్రికెట్‌కు దూరమైన విషయం తెలిసిందే. నిషేధం ముగిసిన అనంతరం ఐపీఎల్‌లో తిరిగి బ్యాటు చేత పట్టిన వార్నర్‌ విజృంభించి ఆరెంజ్‌ క్యాప్‌ను అందుకున్నాడు. ఇటీవల జరిగిన ప్రపంచకప్‌లో రాణించినా సుదీర్ఘ ఫార్మాట్‌ అయినా టెస్టులలో మాత్రం విఫలమవుతున్నాడు. యాషెస్‌ సిరీస్‌లో ఇంగ్లాండ్‌ బౌలర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌కు వికెట్‌ను అర్పించుకుంటున్నాడు. ఈ సిరీస్‌లో ఏకంగా ఐదు సార్లు బ్రాడ్‌ చేతిలోనే వార్నర్ ఔటయ్యాడు.

Image result for david warner stuart broad

ఇదిలావుంటే.. నాలుగో టెస్టు ప్రారంభమయ్యే ముందు ‘క్రికెట్‌ ఆస్ట్రేలియా’ స్టువర్ట్‌ బ్రాడ్‌తో యుద్ధాన్ని వార్నర్ తిరిగి ప్రారంభించనున్నాడని ట్వీట్‌ చేసింది. కానీ కొద్దిసేపటికే బ్రాడ్‌ చేతిలో వార్నర్‌ డకౌట్‌గా వెనుదిరగడంతో ఈ ట్వీట్‌పై ఐసీసీ స్పందించింది. వార్నర్‌ మరోసారి విఫలమయ్యాడని ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం జరుగుతున్న యాషెస్‌లో వార్నర్‌ 79 పరుగులు మాత్రమే చేశాడు. దీనిలో రెండు డకౌట్లు ఉన్నాయి.