బాలిక పట్ల కీచక కోచ్ అసభ్య ప్రవర్తన.. కేంద్రమంత్రి సీరియస్

    0
    936

    తన వద్ద స్విమ్మిగ్ శిక్షణ కోసం వచ్చిన 15 సంవత్సరాల బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన స్విమ్మింగ్ కోచ్ సురాజిత్ గంగూలీపై వేటు పడింది. గోవాకు చెందిన సురాజిత్ 15 ఏళ్ల బాలికను పట్టుకొని అసభ్యంగా ప్రవర్తించిన ఓ వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు ట్యాగ్ చేస్తూ వినోద్ కాప్రి అనే వ్యక్తి ట్వీట్ చేశాడు.

    అయితే.. ఈ విషయమై వెంటనే కేంద్ర మంత్రి స్పందించారు. ‘‘సంబంధిత స్పోర్ట్స్ అథారిటీ ద్వారా వెంటనే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇది చాలా దారుణమైన నేరం. ఆ కోచ్‌పై వెంటనే కఠినమైన యాక్షన్ తీసుకోవాలని పోలీసులను నేను కోరుతున్నాను’’ అని రిజిజు ట్వీట్ చేశారు.

    అలాగే.. ‘‘నేను దీనిపై విచారణ జరిపారు. సురాజిత్ గంగూలీ కాంట్రాక్ట్‌ను గోవా స్విమ్మింగ్ అసోసియేషన్ ఇప్పటికే రద్దు చేసింది. అతనికి భారతదేశంలో ఎక్కడ ఉద్యోగం రాకుండా చేయాలని స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను నేను కోరుతున్నాను. ఇది ప్రతి ఫెడరేషన్, డిసిప్లిన్లకు వర్తిస్తుంది’’ అని మరో ట్వీట్‌లో ఆయన పేర్కొన్నారు.