ప్రజల ఆగ్రహానికి వెనక్కి తగ్గిన పాక్… భారత్ మందులపై నిషేధం ఎత్తివేత

భారత్ పాకిస్థాన్ ప్రభుత్వం భారత్ పై ఉన్న కోపాన్ని తన ప్రజలపై చూపింది. అదే పాక్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. పాక్ సర్కార్ తీసుకున్న నిర్ణయం ఎంత కాలం నిలువలేదు.

0
127

భారత్  పాకిస్థాన్ ప్రభుత్వం భారత్ పై ఉన్న కోపాన్ని తన ప్రజలపై చూపింది. అదే పాక్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. పాక్ సర్కార్  తీసుకున్న  నిర్ణయం  ఎంత కాలం నిలువలేదు. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. భారత ప్రభుత్వం కశ్మీర్ విషయంలో ఆర్టికల్ 370ని రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో భారత్ పై కక్ష సాధించటమే లక్ష్యంగా పెట్టుకున్న పాక్ భారత్ నుంచి దిగుమతి చేసుకునే అత్యవసర మెడిసిన్స్ పై అడ్డుకట్ట వేసింది. ముఖ్యంగా ప్రాణాలను కాపాడే క్యాన్సర్, గుండెకు సంబంధించిన మెడిసిన్స్ దిగుమతిని నిలిపివేసింది. ఆ నిర్ణయమే పాక్ ప్రజలపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపింది. అత్యవసర ఔషదాల కొరత తీవ్రంగా ఏర్పడింది. దీంతో పాకిస్థాన్ ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మా ప్రాణాలతో చెలగాటమాడతారా.. అంటూ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో పాక్ ప్రజల ఒత్తిడికి తలొగ్గాల్సి వచ్చింది. ఈ క్రమంలో భారత్ నుంచి అత్యవసర ఔషధాలను తిరిగి దిగుమతి నిషేధాన్ని ఎత్తివేసింది. దీనికి సంబంధించి చట్టబద్ధమైన ఉత్తర్వులను కూడా జారీ చేసింది.

కాగా..ఔషధాల ఉత్పత్తిలో భారతదేశం అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. గత 16 నెలల కాలంలో పాక్ భారతదేశం నుంచి రూ.250 కోట్ల రూపాయల (36 మిలియన్ డాలర్లు) విలువ చేసే యాంటీ రాబీస్, యాంటీ వీనం వ్యాక్సిన్లను దిగుమతి చేసుకుంది. ఆర్టికల్ రద్దు  చేసిందనే కోపంతో తన పాకిస్థాన్ లో భారతీయ వస్తువులను బహిష్కరించాలని పిలుపునిచ్చింది.

ఇరు దేశాల రైలు, బస్సు సర్వీసులల్ని నిలిపివేసింది. భారతీయ సినిమాలతో పాటు వాణిజ్య ప్రకటనల్ని కూడా పాక్ నిషేధించింది. ఇలా భారత్ పై కక్ష సాధింపు చర్యల్ని చేపట్టిన పాక్..ఔషధాల దిగుమతిని కూడా నిషేధించింది.  దేశంలో అత్యవసర మెడిసిన్స్ కొరత ఏర్పడటంతో ఇది పాక్ ప్రజల ఆగ్రహానికి గురయ్యింది. దీంతో తిరిగి భారత్ నుంచి ఎమర్జన్సీ మెడిసిన్స్ దిగుమతి చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.