ఇకపై టెస్టుల్లో ఓపెనర్‌గా రోహిత్ శర్మ?

0
464

టీమిండియా టెస్టు ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ స్థానంలో రోహిత్ శర్మకు ఓ అవకాశం ఇవ్వాలని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సూచించాడు. వెస్టిండిస్ పర్యటనలో టీమిండియా 2-0తో టెస్టు సిరిస్‌ను కైవసం చేసుకున్నప్పటికీ… ఓపెనర్ల కాంబినేషన్ పూర్తిగా విఫలమైన సంగతి తెలిసిందే. వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఓపెనర్ కేఎల్ రాహుల్‌ 44, 38, 13, 6 పరుగులు మాత్రమే చేశాడు. టెస్టుల్లో గత చివరి 12 ఇన్నింగ్స్‌ల్లో కేఎల్ రాహుల్ ఒక్క హాఫ్ సెంచరీ కూడా సాధించలేక పోయాడు.

Image result for ganguly

దీనిపై సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ ఓపెనింగ్‌ జోడీపై ఇంకా వర్క్ చేయాల్సి ఉందని అన్నాడు. టెస్టుల్లో రోహిత్‌ శర్మ ఓపెనర్‌గా ప్రయత్నించాలని ఇంతకుముందే చెప్పా. అతనో అద్భుతమైన ఆటగాడు. అతడికి ఓ అవకాశం ఇవ్వాలని నేను ఇప్పటికీ నమ్ముతున్నా. వరల్డ్‌కప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన తర్వాత అతడు టెస్టుల్లో స్థానం దక్కుతుందని ఆశించాడు. మిడిలార్డర్‌లో రహానే, విహారి నిలదొక్కుకోవడంతో వేరేవారికి అవకాశం లేదు” అని గంగూలీ చెప్పుకొచ్చాడు.