మంత్రివర్గ విస్తరణ ఆరోజే.. ఆయనకు బెర్త్ ఉందా..?

తెలంగాణలో కేసీఆర్ రెండోసారి అధికారం చేపట్టి పది నెలలు పూర్తయినా పూర్తి స్థాయి కేబినెట్ ఇంకా ఏర్పాటు కాలేదు.

0
71

తెలంగాణలో కేసీఆర్ రెండోసారి అధికారం చేపట్టి పది నెలలు పూర్తయినా పూర్తి స్థాయి కేబినెట్ ఇంకా ఏర్పాటు కాలేదు. లోక్ సభ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు.. మంచి రోజులు లేకపోవడం వంటి కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం దాదాపుగా ఖరారైంది. దసరా రోజున తన కేబినెట్ ను విస్తరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

అయితే.. ప్రస్తుతం మంత్రిమండలిలో సీఎం కేసీఆర్ తో కలిసి 12 మంది ఉన్నారు. నిబంధనల ప్రకారం మరో ఆరుగురికి అవకాశం ఉంది. దీంతో పనితీరు అంతగా బాగోలేని, విమర్శలు ఎదుర్కొంటున్న ఇద్దరు మంత్రులపై వేటు పడటం ఖాయమనే ప్రచారం సాగుతోంది. వీరిలో మంత్రి ఈటల రాజేందర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనని తొలగించడం ఖాయమని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే మరో అమాత్యుడిపై వేటు తప్పదని అంటున్నారు.

దీంతో.. కేబినెట్ లో 8 ఖాళీలు ఉంటాయి. వీటిలో రెండు బెర్తులను మహిళలకు కేటాయిస్తారని సమాచారం. ఈ ఇద్దరిలో ఒకరు చేవెళ్ల చెల్లెమ్మ సబితా ఇంద్రారెడ్డి కాగా, మరొకరు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రేఖానాయక్ అని ప్రచారం సాగుతోంది. మిగిలిన ఆరు ఖాళీల్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డికి కూడా మంత్రి పదవి దక్కనుందని సమాచారం. మిగిలిన నాలుగు ఖాళీల్లో ఒకటి సిద్ధిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావుకి దక్కనుందని సమాచారం. కుమారుడికి పదవి ఇచ్చి మేనల్లుడికి ఇవ్వకపోతే పార్టీ శ్రేణుల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉన్నందున హరీశ్ ను కూడా కేబినెట్ లోకి తీసుకోవాలని కేసీఆర్ నిర్ణయించినట్టు సమాచారం. అయితే హరీష్ కు మంత్రి పదవి దక్కకపోవడంతో ఇప్పటికే అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ఈసారైనా ఆయనకు మంత్రి పదవి దక్కుతుందో.. లేదో చూడాలి మరీ.