భారీ పేలుడు…18 మంది మృతి

    ఈ రోజు భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 18 మంది మృతి చెందగా, మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో 50 మంది ఫ్యాక్టరీలో చిక్కుకుపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

    0
    117

    పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో ఈ రోజు భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 18 మంది మృతి చెందగా, మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో 50 మంది ఫ్యాక్టరీలో చిక్కుకుపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ప్రమాద విషయం  తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేస్తున్నారు.

    అయితే ఓ పెళ్లి వేడుక కోసం బాణసంచా తయారు చేస్తుండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. లోపల చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు శ్రమిస్తున్నాయి. ఈ దుర్ఘటనపై గుర్‌దాస్‌పూర్ బీజేపీ ఎంపీ సన్నీ డియోల్ ట్వీట్ చేశారు. బటాలా ఫ్యాక్టరీలో జరిగిన ఈ దుర్ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని పేర్కొన్నారు.