ఫిల్మ్ చాంబర్‌లో మరో యువతి ఆందోళన…సంచలన ఆరోపణలు

ఫిల్మ్ చాంబర్‌లో మరో యువతి నిరసనకు దిగింది. సునీత బోయ అనే జూనియర్ ఆర్టిస్టు తనకు న్యాయం చేయాలంటూ ఆందోళన బాట పట్టింది. తనను తాను గొలుసులతో బంధించుకుని ఫిల్మ్ చాంబర్‌లో మంగళవారం రాత్రంతా నిరసన తెలిపింది.

0
119

ఫిల్మ్ చాంబర్‌లో మరో యువతి నిరసనకు దిగింది. సునీత బోయ అనే జూనియర్ ఆర్టిస్టు తనకు న్యాయం చేయాలంటూ ఆందోళన బాట పట్టింది. తనను తాను గొలుసులతో బంధించుకుని ఫిల్మ్ చాంబర్‌లో మంగళవారం రాత్రంతా నిరసన తెలిపింది. విషయం తెలుసుకున్న పోలీసులు బుధవారం ఉదయం ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

గీతా ఆర్ట్స్‌లో సినిమా ఛాన్సులు ఇప్పిస్తానని చెప్పి నిర్మాత బన్నీ వాసు మోసం చేశారని, తనపైనే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ ఆమె సంచలన ఆరోపణలు చేశారు. తనకు జరిగిన అన్యాయంపై అల్లు అరవింద్ స్పందించాలని ఆమె డిమాండ్ చేస్తోంది. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు..

ఇంతకీ  సునీత ఎవరు..?

సునీత బోయ జూనియర్ ఆర్టిస్టుగా టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. అయితే సినీ విమర్శకుడు కత్తి మహేష్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని గతంలో ఆమె ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో కత్తి మహేష్‌పై లైంగిక ఆరోపణలతో వార్తల్లో నిలిచి హాట్ టాపిక్ అయిన సునీత.. ఇప్పుడు ఫిల్మ్ చాంబర్ వద్ద నిరసనకు దిగడంతో మరోసారి వార్తల్లోకెక్కింది.