పాకిస్థాన్‌లో రికార్డు సృష్టించిన హిందూ యువతి..అదేంటంటే

  పాకిస్థాన్‌లో హిందూ యువతి రికార్డు సృష్టించింది. పోలీస్ ఉద్యోగం సాధించిన తొలి హిందూ యువతిగా చరిత్ర సృష్టించింది. పుష్పా కొల్హి అనే యువతి ఇటీవల సింధ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పోటీ పరీక్షల్లో విజయం సాధించి

  0
  260

  హిందూ యువతులు మన దేశంలోనే కాదు…ఇతర దేశాల్లో కూడా తమ సత్తా చాటుతున్నారు. యువకులతో సమానంగా తాము కూడా ఎందులోనూ వెనక్కి తగ్గేది లేదని నిరూపిస్తున్నారు. ఒకప్పుడు మహిళలు వంటింటికే పరిమితం అనే పదాన్ని తుడిచేస్తున్నారు. మహిళలు వివిధ రంగాల్లోనూ ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదిస్తూ ఔరా అనిపించుకుంటున్నారు. హిందూ మహిళలు శతృదేశమైన పాకిస్థాన్ లో కూడా వివిధ రంగగాలలో ఉద్యోగాలు సంపాదిస్తూ అందరితోనూ శభాష్ అనిపించుకుంటున్నారు. తాజాగా ఓ హిందూ యువతి కూడా పాకిస్థాన్ లో పోలీసు ఉద్యోగం సంపాదించి అందరి ప్రశ్నంసలు పొందుతున్నారు. ఓ గౌరవప్రదమైన ఉద్యోగంలో  ఎంపికై తమ సత్తా చాటుతున్నారనడంలో అతియోశక్తి కాదు.

  అయితే పాకిస్థాన్‌లో ఉద్యోగం సంపాదించిన ఆ హిందూ యువతి ఇప్పుడు రికార్డు సృష్టించింది. పోలీస్ ఉద్యోగం సాధించిన తొలి హిందూ యువతిగా చరిత్ర సృష్టించింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పోటీ పరీక్షల్లో పాస్ అయిన పుష్ప కొల్హిని సింధ్‌ అనే యువతి అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎఎస్‌ఐ) గా ఎంపికయ్యారు. దీంతో పాకిస్థాన్ దేశంలో ఏఎస్సైగా నియమితులైన తొలి హిందూ యువతిగా ఆమె పేరు రికార్డులకు ఎక్కింది. సింధూ ప్రావిన్స్ లో పుష్ఫా కొల్హికి పోస్టింగ్ ఇచ్చినట్టు అక్కడి మీడియా చానెళ్లు వెల్లడించాయి.

  ఈ విషయాన్ని మానవహక్కుల కార్యకర్త కపిల్ దేవ్ ట్విటర్ ద్వారా కూడా తెలిపారు. జనవరిలో హిందూ సామాజికవర్గానికి చెందిన సుమన్ పవన్ బోదాని సివిల్ మెజిస్ట్రేట్ గా నియమితులయ్యారు. ఇప్పుడు మైనారిటీలుగా ఉన్న హిందువులు నుంచి ఒకరు పోలీసు కావడం విశేషం. పాకిస్థాన్ లో అతిపెద్ద మైనార్టీ కమ్యూనిటీగా హిందువులు ఉన్నారు. అధికారిక లెక్కల ప్రకారం పాకిస్తాన్ లో మొత్తం 75లక్షల మంది హిందువులు ఉండగా.. అనధికారికంగా ఈ సంఖ్య 90 లక్షల వరకు ఉండవచ్చని అంటున్నారు.