చుక్కలు చూపించిన కొత్త వాహన చట్టం.. ఆటోవాలాకు ఫైన్ ఎంతంటే..

    0
    75

    కొత్త వాహన చట్టం.. రూల్స్ పాటించని వాళ్ళ పాలిట శాపమైంది. ఒరిస్సాకు చెందిన మరో ఆటో వాలాను ఈ కొత్త చట్టం షేక్ చేసింది. ట్రాఫిక్ నిబంధనలు పాటించని కారణంగా హరిబంధు అనే ఆటోవాలాకు పోలీసులు రూ. 47,500 జరిమానా విధించారు. మద్యం సేవించి వాహనం నడిపినందుకు రూ.10000, సౌండ్ పొల్యూషన్ కు కారణమైనందుకు రూ. 10000, రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్ సర్టిఫికేట్‌లు లేనందుకు మరో రూ.5000, పర్మిట్ లేనందుకు మరో రూ. 10000, ఇతర ఉల్లంఘనల కింద రూ. 12,500 జరిమానా విధించటంతో మొత్తం జరిమానా రూ.47,500కు చేరింది. తన సెకెండ్ హ్యాండ్ ఆటో ఖరీదే రూ.25,000లకు మించదు అంటూ అతడు లబోదిబో మంటున్నాడు. ఈ చట్టం పట్ల కొంతమంది హర్షం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.