గిల్‌క్రిస్ట్‌ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన భజ్జీ

0
180

క్రికెట్‌ లో డీఆర్‌ఎస్‌ రివ్యూ సిస్టమ్ ఎంత కీలకపాత్ర పోషిస్తుందో అందరికి తెలిసిందే. అంపైర్‌ పొరపాటుగా అవుట్‌ ఇచ్చినా బ్యాట్సమెన్‌ వెంటనే డీఆర్‌ఎస్‌ను కోరి సత్ఫలితాలు సాధిస్తున్నారు. అటు బౌలింగ్‌ చేసే జట్లు కూడా డీఆర్‌ఎస్‌ ద్వారా అనుకున్న ఫలితాలు సాధిస్తున్నాయి. ఈ సిస్టమ్ ను కొంతమంది వ్యతిరేకిస్తుండగా.. మరికొందరు మద్దతునిస్తున్నారు.

Image result for gilchrist harbhajan

తాజాగా.. ఒకప్పటి ఆస్ట్రేలియన్‌ మాజీ వికెట్‌కీపర్‌ ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ ట్విటర్‌లో స్పందిస్తూ ‘ తానూ ఆడే రోజుల్లో డీఆర్‌ఎస్‌ లేకపోవడం వల్లే హర్భజన్‌ సింగ్‌ హ్యాట్రిక్‌ సాధించాడని’ పేర్కొన్నాడు. దీనిపై భజ్జీ స్పందిస్తూ ‘ఆరోజు నువ్వు మొదటి బంతికే ఔటవ్వకపోతే ఎక్కువసేపు ఆడేవాడివి అనుకుంటున్నావా ? గిల్లీ ! ఇప్పటికైనా నీ ఏడుపు ఆపు.. నువ్వు ఆడిన రోజుల గురించి మాట్లాడడం నీకు సరైనదిగానే కనిపిస్తుంది. కానీ అప్పటి నిర్ణయాలు అయితే మారవు, దానికి నువ్వే ఉదాహరణ, ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటావు అంటూ’ భజ్జీ చురకలంటించాడు. ఈడెన్‌గార్డెన్‌ వేదికగా 2001లో ఆసీస్‌తో జరిగిన టెస్టులో హర్భజన్‌సింగ్‌ హ్యాట్రిక్‌ నమోదు చేశాడు. 72వ ఓవర్‌లో వరుసబంతుల్లో రికీ పాంటింగ్‌, గిల్‌క్రిస్ట్‌, షేన్‌వార్న్‌లను ఔట్‌ చేశాడు. ఈ విషయమై వారిద్దరి మధ్య చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.