కమలంలోకి మరో ఇద్దరు కీలక నేతలు

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు కీలక నేతలు, సిట్టింగ్‌లు, మాజీలు ఆయా పార్టీలకు గు

0
78

తెలుగు రాష్ట్రాల్లో  బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు కీలక నేతలు, సిట్టింగ్‌లు, మాజీలు ఆయా పార్టీలకు గుడ్ బై చెప్పేసి కమల దళంలో చేరుతున్నారు. అయితే తాజాగా తెలంగాణలో ఒకప్పుడు కీలక నేతలుగా ఓ వెలుగు వెలిగిన రేవూరి ప్రకాష్‌రెడ్డి, రవీంద్రనాయక్ ఇద్దరూ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్ షాతో లక్ష్మణ్ భేటీ కానున్నారు. లక్ష్మణ్‌తోపాటు ఢిల్లీకి రేవూరి, రవీంద్ర నాయక్ కూడా వెళ్తున్నట్లు సమాచారం. షా ఆధ్వర్యంలో పార్టీలో ఆ ఇద్దరు నేతలు కాషాయ కండువా కప్పుకోనున్నారు.