ఏ పాత్రకైనా సిద్ధం.. ఎలాంటి కండిషన్స్ లేవు

0
82

ఒకప్పటి హీరోయిన్ టబు గుర్తుంది కదా.. ప్రేమదేశం, నిన్నేపెళ్లాడతా సినిమాలలో నటించి కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన ఈ భామ చాలా గ్యాప్ తర్వాత టాలీవుడ్ గడప తొక్కుతుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కథ నచ్చితే ఏ పాత్ర అయినా ఆసక్తిగా పనిచేస్తా. కారెక్టర్ ఎంపికలపై ఎలాంటి నియమాలు పాటించకపోయినా ఎంత ఆనందంగా చేస్తున్నాననేది నాకు ముఖ్యం’’ అని టబు తెలిపారు.

Actress Tabu

దాదాపు 11ఏళ్ల తరువాత టాలీవుడ్‌కు రీఎంట్రీ ఇస్తున్న ఈమె అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తోన్న ‘అలా వైకుంఠపురము’లో కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా.. నవదీప్, సుశాంత్, నివేథా పేతురాజ్, రావు రమేష్, జయరామ్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. రాధా కృష్ణ, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.