ఆయనకు చెప్పే బీజేపీలో చేరాను

0
76

టీటీడీపీ కీలక నేత రేవూరి ప్రకాశ్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం కాషాయ గూటికి చేరారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో రేవూరి బీజేపీ కండువా కప్పుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ పునరేకీకరణ కోసమే బీజేపీలో చేరానని అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తన వాక్చాతుర్యంతో టీడీపీని ఆంధ్ర పార్టీ అని ముద్ర వేశారని విమర్శించారు. నాయకత్వ లేమితో కాంగ్రెస్‌ రోజురోజుకు దిగజారుతోందన్నారు.

అలాగే.. టీడీపీ అధినేత చంద్రబాబుపై తనకు ఎలాంటి కోపం, వ్యతిరేకత లేదని చెప్పుకొచ్చారు. తెలంగాణకు అన్ని విధాలా న్యాయం చేసిన ఏకైక పార్టీ టీడీపీనేనని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబే బీజేపీలోకి వలసలు ప్రోత్సహిస్తున్నారనేది అవాస్తవమని రేవూరి స్పష్టం చేసారు.