అభిమానుల మధ్య చిచ్చురేపుతున్న ఐసీసీ ట్వీట్

0
338

ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఇప్పటికే మూడు మ్యాచ్‌లు జరుగగా ఒక మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, ఒక మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలిచాయి. మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ ఇరు జట్లకు కీలకంగా మారింది. అయితే ఈ మ్యాచ్‌కి ముందు ఐసీసీ చేసిన ఓ ట్వీట్ అభిమానుల మధ్య చిచ్చురేపింది.

Image result for smith ashes

ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ మొదటి టెస్ట్‌లోని రెండు ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. మరోవైపు ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్‌ స్టోక్స్‌ కూడా చెలరేగి ఆడుతున్నాడు. ఓడిపోతుందనుకున్న మూడో టెస్ట్‌లో సెంచరీ సాధించి జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో ఇరు జట్ల అభిమానులు వీరిపై భారీ అంచనాలు పెంచుకున్నారు.

Image result for stokes ashes

అయితే.. హెడ్డింగ్లే టెస్ట్‌కి ముందు స్మిత్ తన కిట్‌తో నడుస్తూ వెళ్తున్న ఫొటోని ఐసీసీ ట్వీట్ చేసింది. అయితే స్మిత్ వెనక ‘వి ఆర్‌ ది అల్టిమేట్ టెస్ట్’ అని రాసి ఉండి.. బెన్ స్టోక్స్ పరిగెత్తున్న బ్యానర్ ఉంది. దీనికి ‘అల్టిమేట్ టెస్ట్ కోసం ఎవరు సిద్ధంగా ఉన్నారో చూడండి’ అని ఐసీసీ క్యాప్షన్ పెట్టింది. ఇది స్మిత్, స్టోక్స్ అభిమానుల మధ్య గొడవకు కారణం అయింది. స్టోక్స్ గొప్ప అంటే.. కాదు కాదు స్మితే గొప్ప అని సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చే జరుగుతుంది.