షమీకి అరెస్ట్ తప్పదా..?

టీం ఇండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి అలిపోరే కోర్టు షాక్ ఇచ్చింది

0
100

టీం ఇండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి అలిపోరే కోర్టు షాక్ ఇచ్చింది. ప్రస్తుతం అద్భుతమైన ఫాంలో ఉన్న షమీ.. ప్రపంచకప్ టోర్నమెంట్‌లో, వెస్టిండీస్ పర్యటనలో అద్భుతంగా రాణించాడు. కీలక సమయంలో ప్రత్యర్థి జట్టు వికెట్లు పడగొట్టి.. జట్టు విజయానికి తన వంతు సహకారం అందించాడు. అయితే గతంలో హసిస్ జహన్ వేసిన గృహ హింస కేసు నేపథ్యంలో షమీ, అతని సోదరుడు హసిద్ అహ్మద్‌కు కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

వీరిద్దరు 15 రోజుల్లోగా కోర్టులో లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న షమీని సిరీస్ ముగిసి భారత్‌కు తిరిగి వచ్చిన వెంటనే పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. గత ఏడాది మార్చిలో షమీ భార్య హసీన్ అతనికి అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ ఆరోపించింది. ఇందుకు సంబంధించి పలు వాట్సాప్ ఛాటింగ్ స్క్రీన్ షాట్‌లు, ఫొటోలు కూడా ఆమె ఫేస్‌బుక్ ద్వారా పంచుకుంది. దీంతో బీసీసీఐ షమీ కాంట్రాక్ట్‌ను రద్దు చేసి విచారణ చేపట్టింది. ఈ విచారణలో షమీ నిర్ధోషి అని తేలడంతో బీసీసీఐ అతని కాంట్రాక్ట్‌ను పొడిగించింది.