వీడు మామూలు రిచ్ కాదు.. జీపు మధ్యలో ఆగిందని కోపంతో..

    0
    86

    ఇంద్రజిత్ సింగ్‌ అనే వ్యక్తి గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో నివసిస్తున్నాడు. అయితే పని మీద ఇంద్రజిత్‌ తన జీపులో బయల్దేరాడు. సగం దూరం రాగానే జీపు రోడ్డు మీద ఆగిపోయింది. ఎంత ప్రయత్నించినా జీపు స్టార్ట్‌ కాకపోవడంతో విసుగెత్తి అందరూ చూస్తుండగానే జీపుపై పెట్రోల్‌ పోసీ తగులబెట్టాడు. ఈ మొత్తం ఘటనను అతని స్నేహితుడు వీడియో తీసి టిక్‌టాక్‌లో పోస్ట్‌ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.

    అయితే.. ఈ వీడియో పోలీసుల దృష్టికి రావడంతో వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. రోడ్డు మధ్యలో ఇలాంటి దుశ్చర్యకు పాల్పడమే గాక ప్రభుత్వ ఆస్తులకు భంగం కలిగించినందుకు వారిపై కేసు కూడా నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై రాజ్‌కోట్‌ ఎస్పీ ఏఎన్‌ రాథోడ్‌ మాట్లాడుతూ.. జీపు బ్యాటరీ పాడవడంతో ఇంద్రజిత్‌కు క్షణికావేశంతో తన జీపును తగులబెట్టాడని, దీనికి సంబంధించి కేసు ఇప్పటికే నమోదు చేశామని తెలిపారు.