వర్మ శిష్యుడి సంచలన ట్వీట్.. ఇంతకీ ఎవరి గురించి..

సోషల్‌ మీడియాలో అజయ్‌ భూపతి ఓ పోస్ట్‌ చేశాడు.

0
70

రామ్‌గోపాల్‌ వర్మ శిష్యులలో ఒకరైన అజయ్‌ భూపతి ‘ఆర్‌ఎక్స్‌ 100’ మొదటి సినిమాతో సూపర్‌ హిట్‌ కొట్టాడు. తొలి సినిమా విడుదలై ఏడాది పూర్తయిన మరో సినిమా మొదలు పెట్టలేదు ఈ దర్శకుడు. రవితేజతో ఓ సినిమా చేస్తాడనే ప్రచారం జరిగిందిగానీ, ఆ సినిమా పట్టాలెక్కలేదు. ‘మహాసముద్రం’ అంటూ ఆ సినిమా గురించి ప్రచారం జరిగింది. ఏమయ్యిందోగానీ, ‘చీప్‌ స్టార్‌’ అంటూ సోషల్‌ మీడియాలో అజయ్‌ భూపతి ఓ పోస్ట్‌ చేశాడు.

దీంతో.. ఈ ‘చీప్‌ స్టార్‌’ ఎవరు? అంటూ తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద చర్చే జరుగుతోంది. ఇంతకీ, ‘స్టార్‌డమ్‌’ ట్యాగ్‌ తగిలించుకుని, అంత చీప్‌గా అజయ్‌ భూపతితో బిహేవ్‌ చేసిందెవరన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. ఓ యంగ్‌ హీరోకి అజయ్‌ భూపతి కథ చెప్పాడనీ, ఆ యంగ్‌ హీరో, అజయ్‌ భూపతి కథని తిరస్కరించడంతోనే ఆ ‘చీప్‌ స్టార్‌’ అనే కామెంట్‌ ఆయన్నుంచి వచ్చిందనీ కొందరంటున్నారు. ఇదిలావుంటే.. వర్మ శిష్యుడిగా పబ్లిసిటీ కోసమే తన గురువు బాటలో పయనిస్తున్నాడని మరికొందరు అంటున్నారు.