వచ్చే ఏడాది రవితేజ సినిమాలు ఇవేనట!

ప్రస్తుతం రవితేజ హీరోగా 'డిస్కోరాజా' తెరకెక్కుతోంది. వీఐ ఆనంద్ దర్శకత్వంలో నిర్మితమవుతోన్నఈ సినిమా, త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది

0
74

ప్రస్తుతం రవితేజ హీరోగా ‘డిస్కోరాజా’ తెరకెక్కుతోంది. వీఐ ఆనంద్ దర్శకత్వంలో నిర్మితమవుతోన్నఈ సినిమా, త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఆ తరువాత సినిమాను గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ చేయనున్నాడట. ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందనుందని సమాచారం. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘డాన్ శీను’ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా తరువాత ప్రాజెక్టును సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ చేయనున్నట్టు చెబుతున్నారు. అందుకు కథా చర్చలు పూర్తయ్యాయనీ, కథను లాక్ చేయడం కూడా జరిగిపోయిందని చెబుతున్నారు. త్వరలో అధికారిక ప్రకటన చేయడమే ఆలస్యం. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.