మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడో చెప్పిన కేటీఆర్

0
76

కోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తే ఈ నెలలోనే మున్సిపల్ ఎన్నికలు ఉంటాయని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన గ్రేటర్‌ టీఆర్ఎస్ నేతలతో సమావేశం నిర్వహించారు. అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ.. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని మున్సిపాలిటీలకు.. సిటీ ఎమ్మెల్యేలను ఇన్‌ఛార్జ్‌లుగా నియమించాలని నిర్ణయించినట్లు చెప్పారు. పార్టీ సభ్యత్వ నమోదు పుస్తకాలను ఈ నెల 6లోపు ఇవ్వాలని నేతలకు ఆదేశించినట్లు తెలిపారు. మున్సిపల్ ఎన్నికలపై ఈనెల 9న కోర్టు విచారణ ఉందని, న్యాయస్థానం అనుమతి ఇస్తే ఈ నెలలోనే ఎన్నికలు జరుగుతాయన్నారు.