మనుగడ కోసం ఎవరి కాళ్ళు పట్టుకున్న తప్పులేదనేదే ఆయన ఫిలాసఫి

0
76

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌ కల్యాణ్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో వేదికగా విమర్శలు గుప్పించారు. ఊసరవెల్లి సిద్ధాంతాలతో నడిచే టీడీపీ పార్టీ.. దేశంలో జతకట్టని పార్టీ అంటూ లేదని విమర్శించారు. మోదీ మళ్ళీ ప్రధాని కానేకాడని జోస్యాలు చెప్పిన సిగ్గు లేని పచ్చ పార్టీ.. ఇప్పుడు బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతోందని విమర్శలు గుప్పించారు. తన మనుగడ కోసం ఎవరి కాళ్ళు పట్టుకున్న తప్పులేదనేది బాబు గారి సిద్ధాంతమని ఎద్దేవా చేసారు.

యజమాని చంద్రబాబు, ప్యాకేజీ ఆర్టిస్ట్ పవన్ కలిసి ఒకే స్క్రిప్ట్ చదువుతున్నారని విజయసాయి విమర్శించారు. ఆయనేమో ఎందుకు ఓడిపోయామో తెలియదంటారని, రెండు చోట్ల అడ్రసు గల్లంతైన పవన్ కళ్యాణ్.. కాలం కలిసొచ్చో, ఈవీఎంల చలవతోనే వైసీపీ గెలిచిందని అంటున్నారని అన్నారు. 23 సీట్లలో బాబును, ఒకచోట పార్ట్‌నర్‌ పవన్ కళ్యాణ్ ను ఎవరు గెలిపించారని ఆయన ప్రశ్నించారు.