బ్రేకింగ్ : శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్

    శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్.

    0
    75

    శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. బుధవారం ఎయిర్‌పోర్టులో బాంబు బ్లాస్ట్‌ చేయబోతున్నానంటూ అధికారులకు ఓ ఆగంతకుడు మెయిల్‌ పంపించాడు. సాయిరాం కాలేరు అనే మెయిల్ ఐడీతో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బాంబ్‌, డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. మెయిల్ పంపిన ఆగంతకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.