పరుగులు పెడుతున్న వెండి ధర

today silver rate

0
66

-మంగళవారం ఏకంగా రూ.1700 పెరిగిన వెండి

పలుకే బంగారమాయేనా.. అనే మాట మార్చిపోవాలి అందరూ. పలుకే వెండిమయమయ్యేనా అనుకోవాల్సిందే. రోజురోజుకూ పరుగులు పెడుతున్నవెండి ధరకు రెక్కలు వచ్చాయి.పది రోజులుగా పైపైకి పెరుగుతున్నన వెండి ధర కిలోరూ.50,200కు చేరుకుంది. వినాయకచవితి పండుగ తర్వాతి రోజైన మంగళవారం ఏకంగా రూ.1,700 పెరిగింది. వెండి ధర భారీగా పెరిగినప్పటికీ బంగారం అదే ధరలో ఉండిపోయింది. కస్టమర్లకు కొంత ఊరట కలిగించే అంశమిదే. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.40,260 వద్ద నిలకడగానే ఉండగా 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర రూ.36,910 వద్దనే నిలకడగా కొనసాగుతోంది.

గ్లోబల్ మార్కెట్లో పాజిటివ్ ట్రెండ్ ఉన్నప్పటికీ దేశీయంగా డిమాండ్ లేకపోవడం ఇందుకొక కారణం. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో వెండి మాత్రం పెరుగుతూనే ఉంది. ఇందుకు కారణం. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి.

అయితే ఢిల్లీ మార్కెట్లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరుగుదలతో రూ.38,910కు చేరింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.10 పెరుగుదలతో రూ.37,710కు ఎగబాకింది. ఇక కేజీ వెండి ధర భారీగా పెరిగింది. రూ.1,700 పెరుగుదలతో రూ.50,200కు పరుగులు పెట్టింది.