పనిమనిషి మాస్టర్ ప్లాన్.. ఓనర్ ను ఫ్రిడ్జ్ లో కుక్కి.. ఆపై లారీలో..

  0
  81

  రోజులు గడిచేకొద్దీ మానవత్వం అనే మాటను మర్చిపోతున్నారు జనం. విపరీత ధోరణితో నమ్మిన వాళ్ళను నట్టేట ముంచుతూ నేర కూపంలో ఇరుక్కుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని గ్రేటర్ కైలాశ్ ప్రాంతంలో కిషన్ దేవ్ ఖోస్లా (92) రిటైర్డ్ ఉద్యోగి, భార్యతో కలిసి ఇక్కడ నివాసం ఉంటున్నాడు. తమకు సాయంగా ఉంటాడని కిషన్ అనే యువకుడిని పనిమనిషిగా పెట్టుకున్నారు. ఎంతో నమ్మకంగా కిషన్ ని చేరదీస్తే.. అతడు దారుణానికి ఒడిగట్టాడు.

  కిషన్ కి డబ్బుపై ఆశతో దుర్బుద్ది పుట్టింది. వెంటనే తన అనుచరులతో కలిసి ఓ రోజు మినీ లారీతో ఖోస్లా ఇంటికి వచ్చాడు. కిషన్ వెంట కొందరు వ్యక్తులు కూడా వచ్చారు. ఖోస్లా దంపతులకు వారు మత్తుమందు ఇచ్చారు. వారు వెంటనే అపస్మారక స్థితిలోకి జారుకున్నారు. ఖోస్లాను ఓ ఫ్రిజ్ లో కుక్కి తాము తీసుకొచ్చిన మిని లారీలో వేసుకుని వెళ్లిపోయారు.

  Image result for 5 men killed 91 years old man in delhi

  మరుసటి రోజు ఉదయానికి ఖోస్లా భార్య మత్తు నుంచి తేరుకోలేకపోయింది. భర్త కనిపించకపోవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించారు. కొందరు వ్యక్తులు ఫ్రిజ్ ను మినీ లారీలో తరలించడం అందులో రికార్డయింది. దానికితోడు కిషన్ కనిపించకపోవడంతో ఇది అతడి పనే అని నిర్ధారించారు. పోలీసులు. కిషన్ తో పాటు అతడి సహచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిషన్ ఇంట్లో ఫ్రిజ్ ని స్వాధీనం చేసుకున్నారు. అందులో ఖోస్లా మృతదేహాన్ని బయటికి తీశారు. డబ్బు కోసమే కిషన్ ఈ పని చేశాడని పోలీసులు తెలిపారు.