నువ్వా.. నేనా అన్నట్లు పోటీ పడుతున్న కోహ్లీ, స్మిత్

0
118

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మరోసారి టెస్టుల్లో మొదటి రాంక్ ను దక్కించుకున్నాడు. గత ఏడాది బాల్ ట్యాంపరింగ్‌కి పాల్పడి నిషేధం ఎదురుకున్న స్మిత్.. ప్రస్తుతం ప్రపంచకప్‌లో మళ్లీ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆ తర్వాత ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. గత ఏడాది రికార్డు స్థాయి యావరేజ్‌తో టెస్టుల్లో నెం.1 ర్యాంకును సొంతం చేసుకున్న స్మిత్.. నిషేధం కారణంగా ఆ ర్యాంకును కోల్పోయాడు.

అయితే వెస్టిండీస్‌, భారత్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్‌ తర్వాత ఐసీసీ టెస్ట్ ర్యాంకులను విడుదల చేసింది. ఇందులో స్టీవ్ స్మిత్ మరోసారి నెం.1 స్థానాన్ని దక్కించుకొని టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టాడు. 904 పాయింట్లతో స్మిత్ నెం.1 స్థానంలో ఉండగా.. కేవలం ఒక్క పాయింట్ తేడాతో కోహ్లీ(903) రెండో ర్యాంకుకు పడిపోయాడు. 878 పాయింట్లతో కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ మూడో ర్యాంకులో, 825 ఛతేశ్వర్ పుజారా నాలుగో ర్యాంకులో, 749 పాయింట్లతో హెర్నీ నికోలస్ ఐదో ర్యాంకులో ఉన్నారు.