నా పాత్రలో ఆమెనే చూడాలని వుంది.. తుది నిర్ణయం వారిదే!

ప్రస్తుతం సినీఫీల్డ్ లో బయోపిక్‌ల ప‌రంప‌ర‌ కొన‌సాగుతుంది.

0
181

ప్రస్తుతం సినీఫీల్డ్ లో బయోపిక్‌ల ప‌రంప‌ర‌ కొన‌సాగుతుంది. తెలుగునాట అరుంధతి సినిమాలో పశుపతిగా అదరగొట్టిన సోనూసూద్.. పీవీ సింధు బ‌యోపిక్ నిర్మించేందుకు క‌స‌ర‌త్తులు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. పీవీ సింధు బయోపిక్ ను తాను నిర్మిస్తూనే, ప్రముఖ బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ పాత్రలో కూడా నటిస్తున్నాడు సోనూసూద్.

అయితే.. పీవీ సింధు పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తార‌నే దానిపై కొద్ది రోజులుగా చర్చ‌లు జ‌రుగుతుండ‌గా, అక్కినేని కోడ‌లు స‌మంత‌ని ఫైన‌ల్ చేసార‌నే టాక్ వ‌చ్చింది. కానీ, తాజాగా సింధు ఇచ్చిన ఇంటర్వ్యూ లో.. త‌న పాత్ర‌లో ఖ‌చ్చితంగా దీపికా ప‌దుకొణే న‌టించాల‌ని భావిస్తున్నాని తెలిపింది. ఆమె చురుకైన బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్‌తో పాటు మంచి న‌టి. అందుకే నా పాత్ర‌లో దీపికాని చూడాల‌ని అనుకుంటున్నాను. ఇక తుది నిర్ణ‌యం మేక‌ర్స్‌దే అని సింధు పేర్కొంది. అయితే.. ప్ర‌స్తుతం దీపికా ప‌దుకొణే .. క‌పిల్ దేవ్ జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న 83 చిత్రంలో నటిస్తోంది.