చెన్నైలో తెలంగాణ కబడ్డీ ఆటగాళ్లపై దాడి

Telangana kabaddi players detained in Chennai after coach attacks bus conductor

0
76

తమిళనాడులో తెలంగాణ కబడ్డీ ఆటగాళ్లపై దాడి జరిగింది. పుదుచ్చేరిలో కబడ్డీ ఆడి తిరిగి వస్తుండగా ఈ దాడి జరిగింది. అన్నాసలైలో బస్సు ఎక్కిన ఆటగాళ్లు చెన్నైలోని ఎగ్మూర్ లో దిగారు. అయితే, టికెట్ విషయంలో బస్సు డ్రైవర్ తో జరిగిన వాదన చివరకు గొడవకు దారి తీసింది. దీంతో, ఎగ్మూర్ లో దిగిన తర్వాత తెలంగాణ ఆటగాళ్లపై వారు ఎక్కిన బస్ కండక్టర్ తో పాటు ఇతర బస్సు కండక్టర్లందరూ కలిసి దాడి దిగారరు. ఈ ఘటనలో కబడ్డీ కోచ్ లక్ష్మణ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దాడిని స్థానికులు సెల్ ఫోన్ తో వీడియో తీశారు. కోచ్ ను కండక్టర్ కొడుతున్న దృశ్యాలు ఈ వీడియోలో రికార్డ్ అయ్యాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కబడ్డి ఆటడ్డీ ఆటగాళ్లను అదుపులోకి తీసుకున్నారు.