చెత్త రికార్డు మూటగట్టుకున్న షమీ

విండీస్ తో జరిగిన టెస్ట్ సిరీస్ భారత్ కైవసం చేసుకుంది.

0
223

విండీస్ తో జరిగిన టెస్ట్ సిరీస్ భారత్ కైవసం చేసుకుంది. సిరీస్ ఆద్యంతం భారత ఆధిపత్యం వెనుక ఉన్న ప్రధాన కారణం ఫాస్ట్ బౌలర్లు. కొందరు బంతితోనే కాదు బ్యాట్‌తో కూడా మెరిశారు. భారత సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ మొదటి ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అయితే మరో బౌలర్ మహ్మద్‌ షమీ మాత్రం బ్యాటింగ్‌లో పూర్తిగా తేలిపోతున్నాడు.

ఈ క్రమంలోనే టెస్టు క్రికెట్‌లో ఓ చెత్త రికార్డును నమోదు చేసాడు. పదో నెంబర్‌ బ్యాట్స్‌మన్‌ అయిన షమీ వరుసగా ఆరు ఇన్నింగ్స్‌లలో సున్నా పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. దీంతో టెస్టుల్లో భారత్‌ తరఫున ఇలాంటి ప్రదర్శనే చేరిన బి. చంద్రశేఖర్‌ రికార్డును సమం చేశాడు.

గత ఏడాది అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌ నుంచి షమీ సున్నాల పరంపర సాగుతోంది. ఇప్పటికైనా షమీ సున్నాలను పక్కనపెడతాడో లేదో చూడాలి. అయితే షమీ బౌలింగ్ విషయానికొస్తే మాత్రం అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇషాంత్, బుమ్రాతో కలిసి వికెట్లు తీస్తున్నాడు.