ఘోర పడవ ప్రమాదం..ఐదుగురు సజీవ దహనం…26 మంది గల్లంతు

    California boat fire

    0
    89

    అమెరికాలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. 39 మంది ప్రయాణిస్తున్న పడవలో సోమవారం తెల్లవారుజామున పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దక్షిణ కాలిఫోర్నియాలోని శాంతాక్లాస్ ద్వీపానికి సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఎనిమిది మంది సజీవ దహనం కాగా 26 మంది ప్రయాణికులు గల్లంతయినట్టు తెలుస్తోంది. రంగంలోకి దిగిన తీరగస్తీ దళాలు పడవలో నిద్రిస్తున్న ఐదుగురిని సురక్షితంగా కాపాడారు. గల్లంతైన వారికోసం గాలింపులు చేపట్టారు. అగ్ని కీలల్లో చిక్కుకున్న పడవలో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. కాగా ప్రయాణికులు నిద్రిస్తున్న సమయంలో ప్రమాదం జరిగిందని అధికారులు గుర్తించారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. లాస్ఏంజిల్స్కు 140 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది.