కేటీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేసిన ఓవైసీ

ఎంఐఎం పార్టీ అధినేత ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కేటీఆర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో ప్రముఖ

0
122

ఎంఐఎం పార్టీ అధినేత ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కేటీఆర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో ప్రముఖ కంపెనీలు రావడానికి కేటీఆర్ కృషి ఉందని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. ఒప్పో, అమెజాన్, వన్ ప్లస్ వంటి ప్రముఖ కంపెనీల రాకతో హైదరాబాద్ గ్లోబల్ పవర్ గా ఎదుగుతోందని ఓ పాత్రికేయుడు చేసిన ట్వీట్ పై అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఇదంతా కేటీఆర్ శ్రమ ఫలితమేనని అన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ ను మళ్లీ ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వర్తిస్తుండగా చూడాలని కోరుకుంటున్నామని తెలిపారు.

అయితే ఓవైసీ చేసిన ఈ ట్వీట్ కు కేటీఆర్ స్పందించారు. అసదుద్దీన్ ఎంతో మంచి మాటలు చెప్పారని, కృతజ్ఞతలు అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.