ఈనెల 19న ముహూర్తం ఫిక్స్

0
117
  • వాయుసేనలో  చేరనున్న తొలి రాఫెల్ విమానం
  • ఈనెల 19న భారత్ కు అప్పగించనున్న ఫ్రాన్స్
  • ఫ్రాన్స్ నుంచి 36 యుద్ధం విమానాల కొనుగోలు
  • 2016లో ఫ్రాన్స్ తో భారత్ ఒప్పందం

కేంద్ర ప్రభుత్వం ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేస్తున్న ప్రతిష్టాత్మక రాఫెల్ యుద్ధ విమానం భారత వాయుసేనలోకి చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 19వ తేదిన తొలి రాఫెల్ విమానాన్ని ఫ్రాన్స్ ప్రభుత్వం భారత వాయుసేనకు అధికారికంగా అందించనున్నట్టు సమాచారం. ఫ్రాన్స్‌లోని మెర్గినాక్‌లో జరిగే ఈ కార్యక్రమానికి ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ మార్షల్ బీఎస్ ధనోవా హాజరు కానున్నట్టు సమాచారం. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఈ కార్యక్రమం కోసం ఫ్రాన్స్ వెళ్లే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

అయితే భారత్ మొత్తం ఫ్రాన్స్ నుంచి మొత్తం 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు చేస్తోంది. వీటి కోసం 2016 సెప్టెంబర్ 23న రూ.59 వేల కోట్లకు ఒప్పందం కూడా కుదుర్చుకుంది. కాగా ఈ నెల 19న భారత వైమానిక దళంలో అధికారికంగా రాఫెల్ చేరుతున్నప్పటికీ.. వచ్చే ఏడాది ఏప్రిల్-మే నాటికి మాత్రమే తొలి బ్యాచ్‌కి చెందిన నాలుగు యుద్ధ విమానాలు భారత్‌కి రానున్నాయి. తుది గడువైన 2022 నాటికి మొత్తం 36 రాఫెల్ విమానాలు అందుబాటులోకి రానున్నాయి.