ఇక కొత్త ట్రాఫిక్ రూల్స్ వచ్చేశాయ్…ఇక బాదుడే..బాదుడు

  ఇటీవల కేంద్ర సర్కారు అమలు చేసిన కొత్త ట్రాఫిక్ నిబంధనలు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చేశాయి. ట్రాఫిక్ ఉల్లంఘించినవారి జేబులు ఖాళీ అవుతున్నాయి. ట్రా

  0
  94
  • ఒక్కరోజులోనే 3వేల 900 చలాన్లు
  • అమల్లోకి వచ్చిన కొత్త ట్రాఫిక్ నిబంధనలు
  • వాహనదారులపై ఢిల్లీ పోలీసుల బాదుడు షురూ..

  ఇటీవల కేంద్ర సర్కారు అమలు చేసిన కొత్త ట్రాఫిక్ నిబంధనలు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చేశాయి. ట్రాఫిక్ ఉల్లంఘించినవారి జేబులు ఖాళీ అవుతున్నాయి. ట్రాఫిక్ కొత్త చట్టం సెప్టెంబర్ 1 (ఆదివారం) నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఒక్కరోజులోనే ట్రాఫిక్ ఉల్లంఘించినవారి నుంచి వేలాది చలాన్లు బాదేశారు ఢిల్లీ పోలీసులు. మొత్తం 3వేల 900 ట్రాఫిక్ చలాన్లు జారీ చేసినట్టు అధికారి ఒకరు వెల్లడించారు. మోటార్ వెహికల్స్ (సవరణ) 2019 బిల్లు గత జూలైలో పార్లమెంటులో ఆమోదం పొందింది.

  ఈ కొత్త చట్టం అమల్లోకి రావడంతో ట్రాఫిక్ నిబంధనలు మరింత కఠినంగా మారాయి. రోడ్డు భద్రత మరింత పెంచి ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా కొత్త చట్టంలో మార్పులు చేశారు. లైసెన్స్ జారీతోపాటు ఇతర ఉల్లంఘనలపై భారీగా జరిమానాలు విధిస్తారు.

  ఒకప్పుటిలా డ్రైవింగ్ లైసెన్స్ ఈజీగా తీసుకోవడం కుదరదు. డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే కచ్చితంగా డ్రైవింగ్ వచ్చి ఉండాలి. పరీక్షలో పాస్ అవ్వాలి. ట్రాఫిక్ రూల్స్ తప్పక తెలిసి ఉండాలి. అప్పుడే డ్రైవింగ్ లైసెన్స్ జారీ అవుతుంది.

  కొత్త చట్టం అమల్లోకి వచ్చిన మొదటి రోజే ఢిల్లీలో ట్రాఫిక్ ఉల్లంఘనల కింద మొత్తం 3వేలకు పైగా ట్రాఫిక్ చలాన్లు జారీ చేసినట్టు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. హెల్మట్ పెట్టుకోకపోయినా, సిగ్నల్ జంప్ చేసినా, వాహనానికి సంబంధించి ఏ పత్రాలు లేకపోయినా…ఏ చిన్న తప్పు చేసినా భారీగా పెనాల్టీలు చెల్లించక తప్పదు.

  కొత్త చట్టం కింద ఎవరైతే హెల్మట్ లేదా సీట్ బెల్ట్ పెట్టుకోరో వారికి రూ. వెయ్యి వరకు జరిమానా విధిస్తారు. గతంలో ఈ రెండెంటికి రూ.100 మాత్రమే జరిమానా ఉండేది. అదే లైసెన్స్ లేకుండా వాహనం నడిపినవారికి రూ.5వేలతో పాటు 3నెలల జైలు శిక్ష విధిస్తారు. ఏదేమైనా వాహనంపై బయటకు వెళ్లాలంటే అన్ని ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందే.