సాహో అభినందన్.. మళ్ళీ విధుల్లోకి ఎంటరయ్యాడుగా..

    Abhinandan Varthaman flies sortie of MIG21 with IAF cheif

    0
    71

    వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ మళ్లీ విధుల్లో చేరారు. పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ బీఎస్ ధనోవాతో కలిసి మిగ్ 21 యుద్ధ విమానాన్ని నడిపారు. ఎయిర్ చీఫ్ మార్షల్ ధనోవా కూడా మిగ్ 21 పైలట్ కావడం విశేషం. 1999 కార్గిల్ యుద్ధం సమయంలో మిగ్ 21 ఫైటర్‌ను నడిపి పాక్ సేనలకు ఆయన వణుకు పుట్టించారు. తాజాగా అభినందన్‌తో కలిసి మిగ్ 21లో ప్రయాణించారు.

    ఇకపోతే.. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ నేపథ్యంలో భారత్‌పై పాకిస్థాన్ దాడికి దిగిన విషయం తెలిసిందే. ఈ దాడులను ఎదుర్కొనే ప్రయత్నంలో ఫిబ్రవరి 27న పాక్‌కు చెందిన ఎఫ్16 విమానాన్ని అభినందన్ కూల్చేశారు. అయితే ఆయన నడుపుతున్న మిగ్ 21 విమానం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోకి కూలిపోయింది. ఆ తర్వాత ఆయన్ను పాక్ జవాన్లు అదుపులోకి తీసుకోగా.. భారత రహస్యాలు వెల్లడించకుండా ఆయన చూపిన ధైర్యసాహసాలు ప్రశంసలు పొందాయి. ఆయన చూపించిన తెగువకు ఇటీవల భారత ప్రభుత్వం వీర్ చక్ర పురస్కారంతో సత్కరించింది.