‘సాహో’కు రెండు రోజుల్లో రూ.200 కోట్లు

0
118

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ‘సాహో’ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కు ప్రేక్షకుల్లో మిశ్రమ స్పందన వస్తోంది. మొదటి రోజు వరల్డ్ వైడ్ ప్రీమియర్స్ తో కలిసి రూ.130 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ‘సాహో’, రెండో రోజు కూడా అదే రీతిలో కలెక్షన్ల పర్వం కొనసాగింది. రెండు రోజుల్లోనే రూ.200 కోట్ల మార్కును అధిగమించినట్లు ‘సాహో’ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ వెల్లడించింది. రెండు రోజుల్లో తమ చిత్రం వరల్డ్ వైడ్ రూ.205 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిందని యూవీ క్రియేషన్స్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.