వైఎస్ఆర్ కు నివాళులు అర్పించిన సీఎం జగన్…అధికారులతో సమీక్షా

0
70

దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 10వ వర్ధంతి సందర్భంగా సీఎం జగన్మోహన్రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి జగన్, వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, వైఎస్ షర్మిల వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. వారితో పాటు వైఎస్సార్సీపీ నాయకులు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్డ్డి, వైఎస్సార్ అభిమానులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా తన తండ్రి రాష్ట్రానికి చేసిన సేవల్ని గుర్తు చేసుకున్నారు సీఎం జగన్.

అయితే కడప పర్యటనలో భాగంగా జగన్మోహన్రెడ్డి పులివెందుల అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటి (పాడ)పై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా యూసీఐఎల్ కాలుష్యంపై అధికారుల వద్ద ఆరా తీశారు. ఇప్పటికే యూసీఐఎల్ కాలుష్యంపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆధ్వర్యంలో నిపుణుల కమిటిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కూడా సమావేశంలో సీఎం వివరాలు సేకరించారు. పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.