మాజీ మంత్రి కన్నుమూత

0
109

మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని దుబ్బాక, దొమ్మాట నియోజకవర్గాల నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గ్రామ సర్పంచ్గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన..ఇటీవల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ రాకపోవడంతో టీఆర్ఎస్ గూటికి చేరారు.
ముత్యంరెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు.