‘బిగ్‌బాస్ 3’లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఎవరో తెలుసా..?

0
87

స్టార్ మా టీవీలో రెండు సీజన్లు కూడా దూసుకెళ్లిన ‘బిగ్‌బాస్ 3’ ఇప్పుడు మూడో సీజన్ కొనసాగుతోంది. ప్ర‌స్తుతం తెలుగు టీవీషోలలో అధిక రేటింగ్‌తో ప్రసారమవుతున్న షో `బిగ్‌బాస్ 3`. నాగార్జున అక్కినేని హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. పుట్టినరోజు సెలబ్రేషన్స్‌ కోసం నాగ్ స్పెయిన్ వెళ్లగా.. ఆయన స్థానంలో రమ్యకృష్ణ  శని, ఆదివారాల్లో హోస్ట్ గా చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆరువారాలు పూర్తి  చేసుకుంది. అయితే  వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన సింహ‌ద్రి త‌మ‌న్నా ఓవారం త‌ర్వాత ఎలిమినేట్ అయిపోయారు. ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లోకి మ‌రొక‌రు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నార‌ని పుకార్లు షికార్లు అవుతున్నాయి. రెండో వైల్డ్ కార్డ్ ఎంట్రీలో శ్రద్దాదాస్, ఈషారెబ్బా పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి.కానీ అవేం నిజం కావ‌ట‌. యాంక‌ర్ శిల్పా చ‌క్ర‌వ‌ర్తి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తుంద‌ని వార్త‌లు కూడా విన‌ప‌డుతున్నాయి. ఇది నిజ‌మైతే ఇప్ప‌టికే యాంక‌ర్ శ్రీముఖితో పాటు శిల్పా చ‌క్ర‌వ‌ర్తి కూడా బిగ్‌బాస్ హౌస్‌లో జాయిన్ అవుతుంద‌న్న‌మాట‌. మరీ ఎరు వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్నారో వేచి చూడాల్సిందే.