బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు

0
149

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 9వ తేదిన బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నట్టు శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు పేర్కొన్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు. అదే రోజున ఆర్థిక మంత్రిగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెడతారు. శాసన మండలిలో ఓ మంత్రి బడ్జెట్ ను ప్రవేశపెడతారు. ఆ మంత్రి ఎవరనేది తెలియాల్సి ఉంది. అయితే ముందుగా బడ్జెట్ సమావేశాలను ఈ నెల 4, 9, 14 తేదీల్లో ఏదో ఒక రోజున ప్రారంభించాలని ప్రతిపాదించగా, చివరికి 9వ తేదీని నిర్ణయించారు.