పార్టీ కార్యదర్శి నుంచి గవర్నర్ వరకు…

0
73

తెలంగాణకు చెందిన సీనియర్ బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన విషయం తెలిసిందే. ప్రస్తుతం హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న కలరాజ్ మిశ్రాను రాజస్థాన్‌కు బదిలీ చేశారు. 2019 సెప్టెంబర్ 1న హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ ను కేంద్రప్రభుత్వం నియమించింది.

దత్తాత్రేయ జననం:
భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడైన బండారు దత్తాత్రేయ జూన్ 12, 1946న జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ పట్టా పొందారు. దత్తాత్రేయ 1989 లో వసంతతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు విజయలక్ష్మి, బండారు వైష్ణవ్.

దత్తాత్రేయ రాజకీయం :
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పని చేసిన ఆయన, 3 సార్లు సికింద్రాబాద్ లోకసభ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. అటల్ బిహారీ వాజపేయి హయాంలో కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రిగా పనిచేశారు. నరేంద్ర మోడి ప్రభుత్వంలో కేంద్ర కార్మికశాఖ మంత్రి గా పనిచేశారు.

1980లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైనారు. 1981-89 కాలంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్నారు. బండారు దత్తాత్రేయ తొలిసారిగా 1991లో సికింద్రాబాదు స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున లోకసభకు ఎన్నికైనారు. 1996-98 కాలంలో రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1998 మరియు 1999లలో కూడా ఇదే స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున విజయం సాధించడమే కాకుండా రెండు సార్లు కేంద్ర మంత్రిమండలిలో స్థానం పొందారు. కేంద్రంలో పలు పార్లమెంటరీ కమిటీలలో పనిచేశారు. తిరిగి..2014 ఎన్నికల్లోనూ ఆయన సికింద్రాబాద్ స్థానం నుంచే పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి టికెట్ దక్కలేదు. 2019 లో కేంద్ర ప్రభుత్వం బండారు దత్తాత్రేయను హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా నియమించారు

ఈ ఏడాది 2019 సార్వత్రిక ఎన్నికల బరిలో దూరంగా ఉన్నారు. అయితే మొదట సికింద్రాబాద్ ఎంపీగా పోటీచేయాలని దత్తాత్రేయ భావించినా అధిష్ఠానం మాత్రం ఆ సీటును ఆయనకు నచ్చజేప్పి స్థానంలో కిషన్ రెడ్డిని బరిలో దింపింది. అప్పుడు దత్తాత్రేయ ఎంపీ సీటు త్యాగం చేయడంతో నేడు గవర్నర్ పదవితో అధిష్ఠానం ఆయను సంతృప్తి పరిచింది.

ఇతర విశేషాలు
దసరా పండుగ సందర్భంగా తెలంగాణ సాంప్రదాయిక పద్ధతిలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా రాజకీయ సామాజిక ప్రముఖులను ఆహ్వానించి, తెలంగాణ సాంప్రదాయిక వంటకాలతో విందు ఇస్తారు.