కత్తితో పార్లమెంట్ లోకి దూసుకెళ్లిన వ్యక్తి…అరెస్టు చేసిన పోలీసులు

0
91

కత్తితో పార్లమెంట్ లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రహెచ్చరికలతో దేశమంతా అప్రమత్తంగా ఉన్నవేళ పార్లమెంటు వద్ద ఈరోజు తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కట్టుదిట్టమైన భద్రత ఉండే పార్లమెంటులోకి ఓ వ్యక్తి బైక్ పై దూసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. వెంటనే పోలీసులు అడ్డుకుని నిందితుడిని నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నారు. 2001, డిసెంబర్ 13న లష్కరే ఉగ్రవాదులు ఇదే గేటు(గేటు నంబర్ 1) నుంచి పార్లమెంటులోకి దూసుకెళ్లి దాడికి పాల్పడ్డారు.

జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు విషయంలో దేశంలో హైఅలర్ట్ కొనసాగుతున్న సమయంలో ఓ వ్యక్తి కత్తితోని పార్లమెంటులోకి దూసుకెళ్లేందు ప్రయత్నించడంపై ఆందోళన నెలకొంది. కాగా, మరోవైపు ఇటీవల లైంగిక వేధింపుల కేసులో ఓ బాబాజీకి మద్దతుగా నిందితుడు నినాదాలు చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. నిందితుడికి అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు..విచారణ జరుపుతున్నారు.